Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అల్లరి నరేష్ ని 'నెల తక్కువోడు' అంటూ...
అల్లరి నరేష్ ని నెల తక్కువోడు అని పిలుస్తున్నాడు దర్శకుడు ఇ.సత్తిబాబు. గతంలో అల్లరి నరేష్ తో బెట్టింగ్ బంగార్రాజు చిత్రం డైరక్ట్ చేసిన సత్తిబాబు తాజా చిత్రం టైటిల్ అది. అల్లరి నరేష్ తో చేయబోతున్న ఈ చిత్రాన్ని అడ్డాల చంటి నిర్మిస్తున్నాడు. మార్చి నెలాఖరునుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. మరో ప్రక్క అల్లరి నరేష్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నారాయణ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ సోలో నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రలోనూ ఆయన చేస్తున్నారు. దీవానా మస్తానా రీమేక్ గా రూపొందుతున్న ఆ చిత్రంలో శర్వానంద్,శ్రియ మరో కీలకపాత్రల్లో కనపించనున్నారు.
ఈ చిత్రం తర్వాత భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందనున్న తమిళ పదం రీమేక్ లో అల్లరి నరేష్ చేయనున్నారు. తమిళ పదం తమిళంలో సూపర్ హిట్టైన చిత్రం. సినిమాలను ప్యారెడీ చేస్తూ నిర్మించిన ఆ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. తెలుగులో సకల కళా వల్లభుడు అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రాలతో పాటు అల్లరి నరేష్ మరిన్ని చిత్రాలను కమిటవ్వుతున్నాడు. 2011లో వచ్చిన సీమ టపాకాయ,మడతకాజా చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయినప్పటికీ ఎవరికీ నష్టాలు తెప్పించలేదు. దాంతో మినిమం గ్యారెంటీ హీరోగా అల్లరి నరేష్ ఎదుగుతున్నాడు. ఈ నెల తక్కువ చిత్రం కూడా పూర్తి స్ధాయి కామిడీగా రన్ అవుతుందని చెప్తున్నారు.