అల్లరి నరేష్ జీవిత సంఘర్షణ

By Srikanya

అల్లరి నరేష్ తమిళంలో 'పొరాళి" టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని టింబు ప్రొడక్షన్స్‌ సంస్థ 'సంఘర్షణ' పేరుతో తెలుగులోకి అనువదిస్తోంది. ఈ విషయమై అల్లరి నరేష్ మీడియాతో మాట్లాడుతూ... ''నిత్యజీవితంలో మనం ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొంటాం. అలా నలుగురు వ్యక్తులు ఎదుర్కొనే సంఘర్షణే ఈ చిత్రం. కథకు తగిన పేరు కుదిరింది. అతి సామాన్యమైన జీవితం కోసం ఓ నలుగురు ఎలాంటి పాట్లు పడ్డారనే విషయాన్ని దర్శకుడు అత్యంత ఆసక్తికరంగా చెప్పారు. ఇది సీరియస్ సినిమా కాదు. వినోదం కూడా ఉంటుంది. సముద్రఖనితో 'శంభో శివ శంభో" చేస్తున్న సమయంలో తమిళ్ వచ్చు కదా.. తమిళ్ సినిమా చేస్తావా? అని అడిగారు.

ఆ సమయంలోనే శశికుమార్, నన్ను కలిపి ఫొటోలు కూడా తీశారు. ఆ తర్వాత ఈ చిత్రం ఆరంభమైంది. చాలా రోజుల తర్వాత నేనక్కడ నటించిన చిత్రమిది. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుంది అని అన్నారు. వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తాం. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత వేదరాజు టింబర్ అన్నాపు. ఈ చిత్రానికి సంగీతం: సుందర్‌ సి.బాబు, సమర్పణ: కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేకానంద కూచిభొట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X