పవన్ కళ్యాణ్ దర్శకుడుతో అల్లరి నరేష్ చిత్రం

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తో 'పంజా' చిత్రం రూపొందించిన దర్శకుడు విష్ణువర్ధన్. ఆయన తమిళంలో అల్లరి నరేష్ తో ఓ చిత్రం చేసారు. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో 'నా అల్లరి'గా విడుదల కానుంది. నరేష్, దివ్య జంటగా విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రాన్ని బీసీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత బొప్పన బాలసుబ్రహ్మణ్యం తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్ర మాలు పూర్తిచేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది.

నిర్మాత బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ - ''తమిళంలో స్టయిలిష్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకుని, 'పంజా' ద్వారా తెలుగుకి పరిచయమైన విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తమిళంలో ఘనవిజయం సాధించింది. యువన్‌శంకర్‌రాజా అందించిన పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.'' అన్నారు.

అలాగే ... ఈ చిత్రం తమిళంలో విడుదలై అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో దివ్య అల్లరి నరేష్‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ ఈ చిత్రానికి హైలెట్‌. డబ్బింగ్‌, రీరికార్డింగ్‌ పూర్తయి ఇటీవలే సెన్సార్‌ కూడా పూర్తయింది. తొలి కాపీతో సిద్ధంగా ఉంది. ఈ నెల 29న భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నా రు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: బొప్పన బాలసుబ్రహ్మణ్యం, దర్శకత్వం: విష్ణువర్ధన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X