అల్లరి నరేష్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ హీరో అల్లరి నరేష్‌తో కలిసి పని చేయడానికి ఓకే చెప్పాడు. అల్లరి నరేష్ హీరోగా చిరునవ్వుతో ఫేం రామ్ ప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్టోరీ సమకూర్చడంతో పాటు డైలాగ్స్, స్క్రిప్టు ఇవ్వడానికి ఒప్పుకునట్లు తెలుస్తోంది.
గతంలో రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన 'చిరునవ్వుతో' చిత్రానికి త్రివిక్రమ్ కథ, డైలాగులు, స్ర్కిప్టు అందించారు. ఆ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు అల్లరి నరేష్. రాజు మహారాజు ఫేం కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ప్రస్తుతం అల్లరి నరేష్ ఇ.సత్తి దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించబోయే సోసియో ఫాంటసీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాయి. ఈ సినిమా వివరాలను నిర్మాత చంటి అడ్డాల వెల్లడిస్తూ -''కొంత విరామం తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. నరేష్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ చిత్రం అవుతుంది. సాంకేతికంగా అద్భుతం అనిపించేలా ఉంటుంది. పూర్తి వినోదభరితంగా సత్తిబాబు ఈ చిత్రం రూపొందించనున్నారు. ఈ కథ విని నరేష్ ఎంతో థ్రిల్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేశారు. ఈ తరహా పాత్రలో నరేష్ నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమా కోసం ఎనిమిది భారీ సెట్స్ నిర్మించనున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











