కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ.. అల్లరి నరేష్‌కు హిట్ గ్యారంటీనా?
అల్లరి నరేష్ మరోకొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా మహర్షి చిత్రంలో మంచి పాత్రను పోషించి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అయితే సోలో హీరోగా హిట్టు కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ అల్లరోడు ప్రస్తుతం బంగారు బుల్లోడు చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించేసి ఫుల్ స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం బంగారు బుల్లోడు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తైన వెంటనే ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. రొటీన్ కమర్షియల్ కంటే ఏదైనా ఓ పాయింట్ చుట్టూ బిగితో కూడాని స్క్రీన్‌ప్లే ఉంటేనే అందరికీ నచ్చుతంది. తాజాగా వచ్చిన కార్తీ ఖైదీ చిత్రం కూడా అలాంటిదే.

మంచి కథల కోసం చూస్తున్న అల్లరినరేష్.. వెంటనే ఈ స్టోరీకి ఓకే చెప్పడానికి ఇది కూడా ఓ కారణం. మోసగాళ్లకు మోసగాడు, ఒక్క క్షణం చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సతీశ్ వేగేశ్న నిర్మాతగా మారి ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











