అల్లరి నరేష్ తో 'నమో వెంకటేశ' నిర్మాతలు
వెంకటేష్ తో నమో వెంకటేశ చిత్రం నిర్మాతలు సుంకర రామబ్రహ్మం ఇప్పుడు అల్లరి నరేష్ తో ఓ కామిడీ చిత్రం నిర్మిస్తున్నారు. జూలై 16 నుంచి మొదలయ్యే ఈ చిత్రానికి ముళ్ళపూడి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 'ఏకే ఎంటర్ టైన్ మెంట్స్' బ్యానర్ పై ఇంతకుముందు వీరూ పోట్ల 'బిందాస్' వంటి హిట్ చిత్రాన్ని నిర్మించారు. నరేష్ తో పాటు శ్రీహరి ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంన్నాడు. ఫుల్ లెంగ్త్ కామిడీగా సాగే ఈ చిత్రానికి మాటలు: ప్రదీప్-శ్రీధర్, సంగీతం: రఘు కుంచె అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్..సీనియర్ దర్శకులు కె.విశ్వనాధ్ చిత్రం శుభప్రదంలోనూ, వంశీతో సరదాగా కాసేపు చిత్రంలోనూ చేస్తున్నాడు.
అల్లరి నరేష్ కె విశ్వనాధ్ శుభప్రదం వంశీ సరదాగా కాసేపు బిందాస్ నమో వెంకటేశ allari naresh k viswanath subhapradam vamsi


Click it and Unblock the Notifications