»   »  దయ్యం తో సరసాలా..?: అల్లరి నరేష్ కొత్త సినిమా కథేంటి?

దయ్యం తో సరసాలా..?: అల్లరి నరేష్ కొత్త సినిమా కథేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గీతాంజలి, త్రిపుర, గంగ ఇలా ఇప్పుడు హర్రర్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది టాలీవుడ్ లో.మినిమం గ్యారెంటీ జోనర్ కావటం తో చిన్న నిర్మాతలు కూడా హారర్ కామెడీ చిత్రాలకే తమ ఓటంటున్నారు. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా ఓ హారర్ కామెడి సినిమా చేస్తున్నాడు.

మూడేళ్ళ క్రితం వచ్చిన "సుడిగాడు" సినిమా తప్పిస్తే తరువాత అల్లరి నరేష్ సినిమాలేవీ విజయం సాధించలేదు. చివరికి అల్లరి నరేష్ నిర్మాతగా మారి బందిపోటు సినిమా తీసినా విజయం మాత్రం దక్కలేదు.చిత్రాలన్నీ వచ్చినవి వచ్చినట్లే పోతున్నాయి . దాంతో ఒకింత జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు అల్లరి నరేష్ . తనకు సీమ శాస్త్రి లాంటి హిట్ ని ఇచ్చిన హాస్య చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.

Allari Naresh next movie with G.Nageshwarreddy

జి.నాగేశ్వర్ రెడ్డి ఇటీవల "ఈడో రకం ఆడో రకం" హిట్ తో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ చిత్రానికి కూడా పేరులోనే అర్థం అయ్యే లాగా టైటిల్ "మా ఇంట్లో ఉంది దెయ్యం నాకెందుకు భయం" అని పెట్టారు. . మరి నిజంగానే దెయ్యంతో జరిగే ఫ్రెండ్ షిప్ స్టోరీనా లేకపోతే మరోసారి తన పెళ్లాం క్యారెక్టర్ ను ఇలా దెయ్యంగా చూపిస్తూ వినోదాన్ని సృష్టిస్తున్నాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు

ఇప్పుడు భారీ సినిమాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, అల్లరి నరేష్,జి.నాగేశ్వర్ రెడ్డి కాంబోలో రానున్న మూవీకు పెట్టిన వెరైటీ టైటిల్ మూవీపై మరింత అంచనాలు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. సో ఈ సినిమాతో అయినా నరేష్ కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుందనే ఆశిద్దాం..

English summary
"Maa Intlo Undi Deyyam, Nakenduku Bayyam" is the latest film of Sudden Star Allari naresh with G.Nageshwar Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu