'పని లేని పులిరాజు' అవతామెత్తనున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ త్వరలో 'పనిలేని పులిరాజు' గా కనిపించనున్నారు. 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న గోళ్లపాటి నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నాగేశ్వరరావు చెప్పిన కధ అల్లరి నరేష్ కి నచ్చిందని, త్వరలోనే డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై గోళ్ళపాటి నాగేశ్వరరావు స్పందిస్తూ...నా నెక్ట్స్ కమిట్ మెంట్ 'పనిలేని పులిరాజు'. 'అల్లరి' నరేష్ తో ఆ సినిమా చేయాలనుకుంటున్నాను. ఆయనకు కూడా కథ వినిపించాను. పూర్తి వివరాలు నిర్మాతలు చెబితేనే బావుంటుంది అన్నారు. ఇక 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' చిత్రంలో శివాజీ, రాజేంద్రప్రసాద్ హీరోలుగా చేస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఇంతకుముందు శ్రీకాంత్, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అఆఇఈ అనే డిజాస్టర్ చిత్రానికి కథ ఇచ్చింది కూడా ఈయనే.


Click it and Unblock the Notifications











