దయచేసి నన్ను అలా పిలవొద్దు:‘అల్లరి’ నరేష్
హైదరాబాద్ : ఇందులో నన్నందరూ 'సడన్‌స్టార్' అని పిలుస్తుంటారు. ఆ ఐడియా నాదే. అయితే... బయట కూడా అందరూ సడన్‌స్టార్ అంటున్నారు. దయచేసి అలా అనొద్దు. నాకు 'అల్లరి' అనే బిరుదే ముద్దు'' అని చెప్పారు 'అల్లరి' నరేష్ . ఆయన తాజా చిత్రం సుడిగాడు ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా రిక్వెస్ట్ చేసారు.
అలాగే ఈ సినిమాకు సుడిగాడు అనే టైటిల్ పెట్టడానికి కారణం చెపుతూ...''ఈ సినిమాకు ముందు 'ఐటమ్‌రాజా' అనే టైటిల్ అనుకున్నాం. కానీ భీమినేని శ్రీనివాసరావుగారికి 'ఎస్' అక్షరం సెంటిమెంట్. ఆయన గత విజయాలు శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం... ఇవన్నీ 'ఎస్' అక్షరంతో మొదలయ్యేవే. అందుకే ఈ సినిమాకు 'సుడిగాడు' అని టైటిల్ పెట్టాం'' అని తెలిపారు నరేష్.
ఇక ''చంద్రశేఖర్ గారికంటే ముందు ఈ సినిమాకు ఇద్దరు నిర్మాతలు మారారు. వంద సినిమాలను కలిపి తీసే సినిమా అనగానే... బడ్జెట్ ఎక్కువ అవుతుందని భయపడి తప్పుకున్నారు. కానీ చంద్రశేఖర్ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా కాన్సెప్ట్‌పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా తీశారు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంత భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావడం, ఇన్ని కోట్లు వసూలు చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు నరేష్.
అంతేగాక... పదమూడు నెలలు కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. పేరడీ సన్నివేశాల్లో నటించడం నా గత చిత్రాల్లో ఒకట్రెండు సార్లు జరిగింది. అయితే.. వంద సినిమాల సన్నివేశాలను పేరడీచేయడం మాత్రం ఇదే ప్రథమం. నాకు ఓ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. 2000 నుంచి 2012 వరకూ విడుదలైన హిట్ సినిమాల్లోని హీరోలందరినీ ఇందులో అనుకరించాను. భవిష్యత్తులో నన్ను కూడా ఎవరన్నా అనుకరిస్తే చాలా ఆనందిస్తాను అని చెప్పారు.
అలాగే కథ డియాండ్ చేస్తే 'సిక్స్ ప్యాక్' చేయడానికి సిద్ధంగా ఉన్నానని నరేష్ తెలిపారు. ఈ సినిమా మాతృక అయిన తమిళ చిత్రం 'తమిళ పడం' దర్శకుడు 'సుడిగాడు' చూసి 'మా కన్నా బాగా చేశారని' ఫోన్ చేసి మరీ అభినందించారని, 'సుడిగాడు' విజయంతో 'తమిళ పడం' రీమేక్ హక్కులకు (ఇతర భాషలకు) డిమాండ్ పెరిగిందని నరేష్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యముడికి మొగుడు, యాక్షన్, కెవ్వు కేక చిత్రాలు నరేష్ నటిస్తుండగా సెట్స్‌పై ఉన్నాయి.


Click it and Unblock the Notifications











