నవ్వించే.. (అల్లరి నరేష్ 'నువ్వా..నేనా 'ప్రివ్యూ)

By Srikanya

'అల్లరి' నరేష్ తాజా చిత్రం 'నువ్వా-నేనా' ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. సోలో చిత్రం నిర్మించిన వంశీకృష్ణ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం పూర్తి స్దాయి ఎంటర్టైనర్. 'నువ్వా-నేనా' అని పోటీపడి మరీ 'అల్లరి' నరేష్, శర్వానంద్, శ్రీయ, విమలారామన్ నవ్వించడానికి రెడీ అయ్యారు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్తున్నారు. నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి భీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ పాటలు ఓ కారణంగా నిలిచాయి. కథేంటో ఓ ముక్కలో చెప్పాలంటే ఇద్దరు అబ్బాయిలు, ఒకే ఒక అమ్మాయి చుట్టూ తిరిగుతూంటుంది. అల్లరి నరేష్ ,శర్వానంద్‌ ఓ అమ్మాయి కోసం ఎన్ని ఎత్తులు వేశారనేది సినిమాలో నవ్వులు కురిపించే అంశం.

ఈ చిత్రవిశేషాలను వంశీకృష్ణ శ్రీనివాస్ చెబుతూ -''మా గత చిత్రం 'సోలో'కన్నా రెట్టింపు విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సూర్య కథ చెప్పినప్పుడే నాకు ఈ నమ్మకం కలిగింది. కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఆశయంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు'' అని చెప్పారు. 'అల్లరి' నరేష్, శర్వానంద్ నటించిన 'గమ్యం' మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఇద్దరిదీ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ సినిమా ఓ అందమైన ప్రయాణం చేసిన అనుభూతిని కలిగిస్తుందని శ్రీయ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే పలు చిత్రాల్లో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం, కోవై సరళ ఈ చిత్రంతో మరోసారి నవ్వించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి 'నవ్వుల విందు' అవుతుందని దర్శకుడు తెలిపారు.

బ్యానర్:ఎస్.వి.కె.సినిమా
చిత్రం:నువ్వా నేనా
నటీనటులు: అల్లరి నరేష్,శర్వానంద్,శ్రియ, విమలా రామన్ తదితరులు
కథ :సూర్య
సంగీతం :బీమ్స్
దర్శకత్వం :నారాయణ
సమర్పణ: సి.హెచ్.ఎమ్.కొండయ్య
నిర్మాత :వంశీకృష్ణ శ్రీనివాస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X