అల్లరి నరేష్ 'రాంబాబు గాడి పెళ్లాం' ఏమైంది?
అల్లరి నరేష్, గజాలా, సోనాలీజోషి కాంబినేషన్లో క్రితం వారం విడుదలైన రాంబాబుగాడి పెళ్ళాం చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ మధ్యనే దుమ్ము దులిపి రిలీజ్ చేసారు. మోహన్ బాబుతో గతంలో శివ శంకర్ చిత్రం రూపొందించిన కాపుగంటి రాజేంద్ర రూపొందించిన ఈ కామిడీ చిత్రంలో జోక్స్ పేలకపోవటం మైనస్ అయితే అల్లరి నరేష్ అప్పటికి ఫరిణితి చెందని నటన మరో నస అని చెప్తున్నారు. బెండు అప్పారావు విజయాన్ని క్యాష్ చేసుకునే దశలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో మరో తమాషా అంసం ఫిల్మ్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. సినిమా నిర్మాతల పేర్లు టైటిల్స్‌లో వేరేవారివి ఉండగా, బయిట వాల్‌పోస్టర్లపై ఇంకొకరివి ఉండటం. అలాగే ఈ చిత్రానికి పెట్టిన ట్యాగ్‌లైన్ 'వాడికా ఫీలింగేలేదు" అనేది తెరపై మారి పోయి 'ట్రూత్ ఈజ్ యూత్"గా కనపడింది. ఇవన్నీ గ్యాప్ తర్వాత రిలీజ్ చేసిన చిత్రం కావటం వల్ల వచ్చిన సమస్యలు. ఏదైమైనా సబ్జెక్టులో బలం లేకపోవటంతో సినిమా కూడా పోయింది.


Click it and Unblock the Notifications











