»   » భారీ కామెడీ ( 'లడ్డూబాబు' ప్రివ్యూ)

భారీ కామెడీ ( 'లడ్డూబాబు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హిట్టు,ఫ్లాపులకు సంభంధం లేకుండా అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూసే చిత్రాలు ఏవీ అంటే అల్లరి నరేష్ వి అని కళ్లు మూసుకుని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యన తన కామెడీ చిత్రాల్లో కామెడీ పాలు బాగా తగ్గటంతో వెనకబడిన నరేష్ తిరిగి తన మూలాల్లోకి అంటే తనను నటుడుగా పట్టాలు ఎక్కించిన రవిబాబు తో చేసి,హిట్ కొట్టడానికి సిద్దమయ్యారు. అందులోనూ కమల్ హాసన్ చిత్రాల తరహాలో మేకప్ లో వైవిధ్యం చూపిస్తూ వస్తున్న ఈ చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ ని నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఈ రోజు తేలనుంది.

లడ్డుబాబు (అల్లరి నరేష్‌) వయసు... 28 ఏళ్లు. బరువు 268 కిలోలు. తనకూ ఓ గాళ్‌ ఫ్రెండ్‌ ఉండాలని కలలు కంటుంటాడు. అయితే ఆ కాలనీలో అతనితో ఆడుకోవాలని చూసేవాళ్లే ఎక్కువ. ఏదో జంతువుని చూసినట్టు నవ్విపోతుంటారు. కానీ ఇద్దరమ్మాయిలు (భూమిక, పూర్ణ) మాత్రం లడ్డుబాబుని మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. వాళ్లలో లడ్డుబాబు మనసుని అర్థం చేసుకొన్నదెవరు? చివరికి అతను ఎవరికి దగ్గరయ్యాడు? అనేది తెలియాలంటే లడ్డుబాబు సినిమా చూడాల్సిందే.

నరేష్ మాట్లాడుతూ... "పేరులో బాబు ఉంది. కానీ... ఆకారం చూస్తే భీమ్‌ బోయ్‌లా ఉంటాడు. వయసు 25. బరువు మాత్రం అంతకు పదింతలు. నడుము చుట్టుకొలత కొలవడానికి మీటర్లు సరిపోవు. కిలోమీటర్లు కావాలి. అతని సైజుకు బుల్లెట్లు కాదు.. బుల్డోజర్లు వాడాలి. వెంటనే బరువు తగ్గిపోదాం అనుకొని సైక్లింగ్‌ మొదలెట్టాడు.. ఒక్క తొక్కు తొక్కాడో లేదో.. ఫెడళ్లు ఫడేల్‌మన్నాయి. లాంగ్‌ జంప్‌ చేశాడు. అక్కడో అగాథం ఏర్పడింది. రన్నింగ్‌ మొదలెడితే వాతావరణ శాఖ 'భూకంపం వచ్చింద'ని భయపడిపోయింది. ఇదీ లడ్డుబాబు పడిన.. సారీ పెట్టిన కష్టాలు. మరి అవెంత తమాషాగా సాగాయో తెలియాంటే మా సినిమా చూడండి.." అంటున్నారు నరేష్‌.

Allari Naresh - Ravi Babu Laddu Babu preview

అలాగే... ''లడ్డుబాబుగా భలే ఉన్నావ్‌.. అని అందరూ అంటున్నారు. అయితే ఆ ఆకారం కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో..? మేకప్‌ కోసం రోజుకి ఐదు గంటలు వెచ్చించాల్సి వచ్చేది. అదనంగా రెండొందల కేజీల బరువు మోయడమంటే మాటలా.? అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉండేది. చుట్టూ ఏసీ ఉండాల్సిందే. లావుగా ఉన్నవారి సమస్యల్ని చూపిస్తున్నాం. అలాగని వాళ్లని కించపరిచే సినిమా కాదిది. ఈ సినిమా చూశాక వారిపై మరింత గౌరవం పెరుగుతుంది'' అన్నారు.

రవిబాబు మాట్లాడుతూ... ''ఆద్యంతం వినోదం పంచే చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. లడ్డుబాబు ఎంత భారీగా ఉన్నాడో.. వినోదం కూడా అంతే భారీగా ఉంటుంది. చక్రి అందించిన బాణీలు బాగున్నాయి'' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''భారీకాయంతో నరేష్‌ పంచే వినోదాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆ అవతారం కోసం నరేష్‌ చాలా శ్రమించారు. రవిబాబు ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయో ఈ చిత్రం మరోసారి నిరూపిస్తుంది. రవిబాబు సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. తొలి చిత్రం 'అల్లరి'లో వినోదాన్ని వినూత్నంగా ఆవిష్కరించి, ఓ ట్రెండ్ సృష్టించారు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, తాజా చిత్రం 'లడ్డూబాబు' మరో ఎత్తు అనే చెప్పాలి. 'అల్లరి' చిత్రంలో బక్కపలచని నరేష్ ని చూపించిన రవిబాబు 'లడ్డూబాబు'లో భారీకాయుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం విదేశీ నిపుణులు నరేష్ కి మేకప్ వేశారు. మేకప్ చేయడానికి కొన్ని గంటలు పట్టడం మాత్రమే కాదు.. తీయడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది'' అన్నారు.


చిత్రం: లడ్డుబాబు
నటీనటులు: అల్లరి నరేష్‌, భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు
సంగీతం: చక్రి,
కెమెరా: సుధాకర్ రెడ్డి,
స్క్రీన్ ప్లే: సత్యానంద్,
మాటలు: నివాస్,
పాటలు: భాస్కరభట్ల,
ఆర్ట్: నారాయణరెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
నిర్మాత: త్రిపురనేని రాజేంద్రప్రసాద్‌,
రచన - దర్శకత్వం: రవిబాబు
విడుదల: 18, ఏప్రియల్, 2014 (శుక్రవారం)

English summary
Allari Naresh’s ‘Laddu Babu’ directed by Ravi Babu and produced by Tripuraneni Rajendra under the banner Maharadhi films is going to release on 18th April. Actress Poorna is playing lead role in the movie and actress Bhumika is playing special role in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu