రామానాయుడు గారికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం
అహ నా పెళ్లంట టైటిల్‌ను రామానాయుడు నుండి తీసుకునేటప్పుడు గత చిత్రం గొప్పతనాన్ని చెడగొట్టమని హామీ ఇచ్చి తీసుకున్నాం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ముచేయలేదని చెబుతున్నామని చిత్ర నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.నరేష్, రీతూబర్మేచా జంటగా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో అనిల్‌సుంకర నిర్మించిన 'అహ నా పెళ్లంట" చిత్రం ఈ బుధవారం మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో నిర్వహించారు ఈ సందర్భంగా ఇలా స్పందించారు.
అలాగే దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ- చిత్రం విడుదలైన రోజు మార్నింగ్ షోనుండి మంచి టాక్ వచ్చింది. . తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి మంచి రివ్యూలు రాసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా స్టోరీ, గెటప్‌లు అన్నీ బాగా కుదరడంతో చిత్రం విజయవంతమైందని ముగించారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్, శ్రీహరి, రఘుకుంచె, డ్రాగన్ ప్రకాష్,శ్రీ్ధర్, నాగినీడు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











