»   » అల్లరి నరేష్ బర్త్ డే.... భార్యతో కలిసి ఇలా (ఫోటోస్)

అల్లరి నరేష్ బర్త్ డే.... భార్యతో కలిసి ఇలా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ నేడు 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. తన భార్యతో కలిసి జరుపుకున్న తొలి పుట్టనరోజు వేడుక ఇది. అందుకే ఈ వేడుకను అల్లరి నరేష్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరూప భర్తతో కలిసి ఓ సెల్ఫీ ఫోటోను పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్ డే మై రియల్ లైఫ్ హీరో' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

తన పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేష్ తన తాజా సినిమా ‘జేమ్స్ బాండ్' సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. సినిమా జూన్ చివరి వారంలోనే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో సినిమాను జులై 17కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంటే బాహుబలి విడుదలైన వారం రోజుల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అల్లరి నరేష్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. నెల రోజుల క్రితం(మే 29)న అల్లరి నరేష్ వివాహం విరూపతో జరిగింది. పెళ్లి తర్వాత అల్లరి నరేష్ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో అల్లరి నరేష్, విరూపకు సంబంధించిన దృశ్యాలు.

బర్త్ డే సెల్ఫీ
  

బర్త్ డే సెల్ఫీ

పుట్టినరోజు సందర్భంగా భార్యతో కలిసి సెల్పీ. ఈ ఫోటోను విరూప తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా షేర్ చేస్తూ... ‘హ్యాపీ బర్త్ డే మై రియల్ లైఫ్ హీరో' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

వివాహం
  

వివాహం

అల్లరి నరేష్-విరూప వివాహం మే 29, 2015న జరిగింది.

విరూప అల్లరి
  

విరూప అల్లరి

పెళ్లి తంతులో నరేష్ కంటే విరూప చాలా చలాకీగా కనిపించింది.

మాంగళ్య ధారణ
  

మాంగళ్య ధారణ

అల్లరి నరేష్-విరూప పెళ్లి వేడుకలో అతి ముఖ్యమైన మాంగళ్యధారణ ఘట్టానికి సంబంధించిన ఫోటో.

కుటుంబం
  

కుటుంబం

అల్లరి నరేష్ కుటుంబం. పెళ్లి వేదిక వద్ద అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Please Wait while comments are loading...