అల్లరి నరేష్ ‘బందిపోటు’ ఫస్ట్ లుక్

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'బందిపోటు'. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఏ సినిమాకు ఈ చిత్రం వ్యంగాత్మక రూపకం కాదని, కేవలం అందరిని కామెడీతో అలరించాలన్న కోరికతో చేస్తున్న చిత్రమని చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

Allari Naresh Bandipotu first look

దొంగల్ని దోచుకునే బందిపోటు కథను ఎంతో వినోదంగా రూపొందిస్తున్నామని, ఓ మంచి కథ దొరకడంతో మోహన్‌కృష్ణతో ఈ చిత్రం చేస్తున్నామని, ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, నవ్వించడమే ప్రత్యేక ప్రయోగమని అల్లరి నరేష్ తెలిపారు. రాజేష్మా ట్లాడుతూనాన్న పేరు నిలబెట్టేలా ఈ సంస్థలో చిత్రాలను నిర్మిస్తున్నామని, తామనుకున్న స్థాయిలో కథ దొరకడంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రాజేష్ తెలిపారు.

హీరోయిన్ గా లేదా మెయిన్ లీడ్ నటి గా చేయటంలో విఫలమైన శ్రద్దా దాస్ ఐటం ఈ చిత్రంలో గర్ల్ గా కనిపించి అలరించనుంది. మేరకు ఆమె మీద రీసెంట్ గా హైదరాబాద్ లో షూట్ చేసారు. ఆమె ఐటం సాంగ్ చిత్రం హైలెట్స్ లో ఒకటని అంటున్నారు. పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, రావూ రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరు, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్:శ్రవణ్, నిర్మాత: ఆర్యన్ రాజేష్, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X