అల్లరి నరేష్ ‘బందిపోటు’ రిలీజ్ డేట్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'బందిపోటు'. ఇటీవలే ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందని యూనిట్ సభ్యులు అంటున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది.

ఫిబ్రవరి 6న సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాకు. ఏ సినిమాకు ఈ చిత్రం వ్యంగాత్మక రూపకం కాదని, కేవలం అందరిని కామెడీతో అలరించాలన్న కోరికతో చేస్తున్న చిత్రమని చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

Allari Naresh’s Bandipotu on February 6th

దొంగల్ని దోచుకునే బందిపోటు కథను ఎంతో వినోదంగా రూపొందిస్తున్నామని, ఓ మంచి కథ దొరకడంతో మోహన్‌కృష్ణతో ఈ చిత్రం చేస్తున్నామని, ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, నవ్వించడమే ప్రత్యేక ప్రయోగమని అల్లరి నరేష్ తెలిపారు. రాజేష్మా ట్లాడుతూనాన్న పేరు నిలబెట్టేలా ఈ సంస్థలో చిత్రాలను నిర్మిస్తున్నామని, తామనుకున్న స్థాయిలో కథ దొరకడంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రాజేష్ తెలిపారు.

హీరోయిన్ గా లేదా మెయిన్ లీడ్ నటి గా చేయటంలో విఫలమైన శ్రద్దా దాస్ ఐటం ఈ చిత్రంలో గర్ల్ గా కనిపించి అలరించనుంది. పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, రావూ రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరు, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్:శ్రవణ్, నిర్మాత: ఆర్యన్ రాజేష్, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X