కామెడీ కే ఓటు... ( 'బందిపోటు' ప్రివ్యూ )

By Srikanya

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. ఆశించిన కామెడీ చిత్రంలో కనపడకపోవటంతో నవ్వులను ఆశించి వెళ్తున్న ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. అయితే ఈ సారి అలా జరగదు..నవ్వులకు గ్యారెంటీ అంటూ ఈ చిత్రంతో వస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సైతం గతంలో అష్టాచెమ్మ వంటి కామెడీ చిత్రం రూపొందించి ఉండటంతో చిత్రంలో ఫన్ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు, సప్తగిరి వంటి స్టార్ కమిడయన్స్ ఉండటంతో సినిమా కామెడీ కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ...‘‘దొంగల్ని దోచుకునే బందిపోటు కథను ఎంతో వినోదంగా రూపొందిస్తున్నామని, ఓ మంచి కథ దొరకడంతో మోహన్‌కృష్ణతో ఈ చిత్రం చేస్తున్నామని, ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, నవ్వించడమే ప్రత్యేక ప్రయోగమని తెలిపారు. నాన్నగారి బ్యానర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు, సప్తగిరితో కలిసి కామెడీ చేశాను. బందిపోటు మంచి సినిమా అవుతుంది'' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈవీవీ సంస్థ రీలాంచ్‌ నా సినిమాతో కావడం ఆనందంగా ఉంది. చక్కటి కథతో తెరకెక్కిస్తున్నాం. పరిపూర్ణమైన కథానాయకుడిగా నరేష్‌ ఇందులో కనిపిస్తారు. ఇప్పటివరకు ఆయన చేయని కొత్త తరహా కామెడీని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆరోగ్యకరమైన నవ్వులున్న సినిమా అవుతుంది. ఎక్కడా వెకిలితనం ఉండదు'' అని అన్నారు.

Allari Naresh's Bandipotu preview

ఈషా మాట్లాడుతూ ‘‘కీలకపాత్ర చేస్తున్నాను. వైవిధ్యమైన పాత్ర'' అని చెప్పారు. హీరోయిన్ గా విఫలమైన శ్రద్దాదాస్ ఈ చిత్రంలో ఐటం గర్ల్ గా కనిపించి అలరించనుంది.ఈ మేరకు ఆమె మీద రీసెంట్ గా హైదరాబాద్ లో షూట్ చేసారు.

నిర్మాత ఆర్యన్‌ రాజేష్‌ మాట్లాడుతూ...‘‘ మా నాన్న గారు పేరు నిలబెట్టేలా ఈ సంస్థలో చిత్రాలను నిర్మిస్తున్నామని, తామనుకున్న స్థాయిలో కథ దొరకడంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రాజేష్ తెలిపారు. నాన్నగారి బ్యానర్‌లో ప్రెస్టీజయస్‌గా రూపొందిస్తున్న సినిమా ఇది. జనవరి1, 2000లో మా సంస్థను ప్రారంభించాం. ఈవీవీ బ్యానర్‌ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ప్రజలు ఎదురుచూసే విధంగా ఏడాదికి ఒకటీ, రెండు మంచి సినిమాలను ప్లాన్‌ చేస్తున్నాం'' అని అన్నారు.

చిత్రం: ‘బందిపోటు'
బ్యానర్ : ఇవివి సినిమా
నటీనటులు: అల్లరి నరేష్‌, ఈష, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, చంద్రమోహన్‌, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, అవసరాల శ్రీనివాస్‌, సాయాజీ షిండే తదితరులు ఇతర పాత్రధారులు.
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, రాంబాబు గోసాల, కెమెరా: పి.జి.విందా,
సంగీతం: కల్యాణి కోడూరి.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: రాజేష్‌ ఈదర
విడుదల తేదీ: 20, పిభ్రవరి 2015.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X