Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
బెట్టింగుల పిచ్చితో అల్లరి నరేష్
'బెండు అప్పారావు ఆర్.ఎంపి' గా అదరకొట్టే కలెక్షన్స్ తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తన కామిడీ పంచ్ ని విదల్చటానికి రెడీ అవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రంలో నటిస్తున్నాడు. నిధి హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బంగార్రాజు పాత్రను నరేష్ పోషిస్తున్నాడు. ప్రతీ దానికి బెట్టింగ్ లు కాసే అలవాటున్న నరేష్ ఓ అనుకోని సిట్యువేషన్ లో ఇరుక్కుంటారు. అక్కడ నుంచి బయిటపడి బెట్టింగ్ ల వల్ల వచ్చే నష్టాలు తెలుసుకోవటమే చిత్ర కథ అంటున్నారు.
ఇక దర్శకుడు ఇ.సత్తిబాబు గతంలో ఏవండోయ్ శ్రీవారు, ఓ చినదానా వంటి కామిడీలను, అల్లరి నరేష్ తో నేను చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రం మిగతా పాత్రల్లో చలపతిరావు, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణభగవాన్, ఎల్.బి. శ్రీరామ్, రఘుబాబు, దువ్వాసి మోహన్, అమిత్, పిళ్లా ప్రసాద్, సన, ప్రగతి, సురేఖావాణి, కల్పన, జ్యోతి, హేమ తదితరులు కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి కథ: లంకపల్లి శ్రీనివాస్, మాటలు: నాగరాజు గంధం,సంగీతం: శేఖర్‌చంద్ర, ఫొటోగ్రఫీ: కరుణమూర్తి, లైన్ ప్రొడ్యూసర్ : పొట్లూరి సత్యనారాయణ, నిర్మాత: రామోజీరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు