తల్లీ! నీ త్రివిక్రమ్ ప్రాస లు ఆపుతావా? (వీడియో)
హైదరాబాద్ : సినిమాలో ప్రాసలతో కూడిన పంచ్ లకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఆయన వచ్చాకే దాదాపు అలాంటి ఒరవడి డైలాగులలో మొదలైందని చెప్పాలి. ఈ ప్రాస డైలాగులకు పంచ్ వేద్దామనుకుంట్లున్నాడు అల్లరి నరేష్. అందుకేనేమో...అతని తాజా చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' లో ఓ డైలాగు ఒకటి వేసేసాడు. దానికి సంభందించిన టీజర్ విడుదలైంది...మీరూ చూసి ఎంజాయ్ చేయండి..
నరేశ్, కార్తీక కవలలుగా నటిస్తున్న ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' సినిమా షూటింగ్‌తో పాటు రీరికార్డింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇ.వి.వి. సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమిల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి. చిన్ని దర్శకుడు.

నరేశ్ మాట్లాడుతూ ‘‘హీరోయిన్‌గా చేస్తున్న టైమ్‌లో సిస్టర్‌గా చెయ్యడానికి ఒప్పుకున్న కార్తీకకు థాంక్స్ చెప్పాలి. ఇందులో అందరి బెండు తీసే అమ్మాయిగా వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేసింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించే బ్రదర్‌గా నానా తంటాలుపడే కేరక్టర్ చేశాను. ఇటీవల నా సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ మిస్సవుతున్నారనే ఫీలింగ్ ఉంది. ఈ సినిమా వాళ్లకు బాగా నచ్చుతుంది'' అని చెప్పారు. దర్శకుడు చిన్ని మాట్లాడుతూ ఇందులో నరేశ్ ఫ్రెష్‌లుక్‌తో కనిపిస్తారనీ, ఈ సినిమా తర్వాత శేఖర్‌చంద్ర మంచి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారనీ అన్నారు.
నరేశ్ జోడీగా మోనాల్ గజ్జర్, కార్తీక సరసన హర్షవర్థన్ రాణే నటించిన ఈ చిత్రంలో భానుశ్రీ మెహ్రా, బ్రహ్మానందం, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడు, ఎల్బీ శ్రీరామ్, జీవా, కెల్లీ డోర్జీ, అభిమన్యుసింగ్, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, సుధ, సురేఖావాణి తారాగణం. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవికుమార్, శ్రీమణి, స్టంట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











