అలాంటి సీన్ ఉంటే విమర్శలే: మహేష్ బాబు ‘మహర్షి’ రూమర్లపై అసలు నిజం ఇదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నరేష్ పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
టాలీవుడ్లో కామెడీ హీరోగా పాపులర్ అయిన నరేష్... అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించారు. ఆయా సినిమాల్లో నరేష్ పాత్ర చనిపోవడం, సినిమా సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. 'మహర్షి'లో కూడా ఇలాంటి విషాదమే రిపీట్ అవుతుందనే వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

‘మహర్షి'లో అలాంటి విషాదం ఏమీ ఉండదు
బయట ప్రచారం జరుగుతున్నట్లు ‘మహర్షి'లో హీరో ఫ్రెండ్ పాత్ర పోషిస్తున్న అల్లరి నరేష్ చనిపోవడం లాంటి విషాదకరమైన సీన్లు ఏమీ ఉండవని, అలాంటి రూమర్స్ నమ్మవద్దని చిత్ర బృందం నుంచి వినిపిస్తున్న మాట.

నరేష్ అదిరిపోయే పెర్ఫార్పార్మెన్స్
ఇప్పటి వరకు అల్లరి నరేష్ చేసిన అన్ని సినిమాల కంటే ఈ చిత్రంలో అతడు పోషించిన పాత్ర పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని, అవార్డ్ గెలుచుకునే స్థాయిలో నరేష్ మెప్పిస్తాడని టాక్. మహేష్ బాబు పాత్ర తన స్నేహితుడికి సహాయ పడే విధంగా ఉంటుందట.

వంశీ పైడిపల్లి అలా విమర్శల పాలయ్యే డైరెక్టర్ కాదు
అల్లరి నరేష్ పాత్రను చంపేసి, సినిమాలో విషాద సంఘటను క్రియేట్ చేసి, ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యేలా చేస్తే.... విమర్శలు తప్పవని, ఎందుకంటే గతంలో నరేష్ మీద అలాంటి ప్రయోగాలు ఆల్రెడీ జరిగాయి, వంశీ పైడిపల్లి అలాంటిది మళ్లీ రిపీట్ చేసి విమర్శల పాలయ్యే రకం కాదు... అని అభిమానులు చెబుతున్నమాట.

విదేశాల నుంచి ఇండియాకు వచ్చి
హీరో విదేశాల నుంచి ఇండియా వచ్చి రైతులకు సహాయం చేసే ఒక అద్భుతమైన కాన్సెప్టు ఇందులో ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ మూవీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, యూత్, ఫ్యామిలీ, రైతులు, బిజినెస్ పర్సన్స్ ఇలా అందరికి సంబంధించిన అంశాలు ఉంటాయని టాక్.

యువతకు స్పూర్తినిచ్చే విధంగా
‘సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు.. సక్సెష్ అనేది ఒక ప్రయాణం' అనే కాన్సెప్టుతో రూపొందిన ‘మహర్షి' చిత్రం యువతకు స్పూర్తినిచ్చే విధంగా ఉంటుందని, స్నేహం గురించి కూడా అద్భుతమైన సీన్లు ఉంటాయని, మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మహర్షి
‘మహర్షి' చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. రూ.200 కోట్ల మినిమమ్ కలెక్షన్ అంచనాతో కనీవినీ ఎరుగని రితిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











