అల్లరి నరేష్ కెరీర్‌లోనే హై బడ్జెట్‌

By Srikanya

అల్లరి నరేష్ కెరీర్‌లోనే హై బడ్జెట్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కథానుగుణంగా ఇందులో భారీ సెట్టింగులు, అద్భుతమైన గ్రాఫిక్స్ అవసరం. అందుకే ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నాం అంటున్నారు నిర్మాత అడ్డాల చంటి. యమలోకం నేపథ్యంలో అల్లరి నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం యముండ. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి మీడియాకు తెలియచేసారు.

సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రం యముడు బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. కథ ప్రకారం అల్లరి నరేష్ ఓ అల్లరి నరేష్. ఆ అల్లరి కుర్రాడికి అన్నింట్లోనూ తొందరే. ఏం చేసినా చిరిగి చాటంత అయితేనేగానీ మనసు కుదుటపడదు. అయితే ఒకానొక సిట్యువేషన్ లో ఈ అల్లరి కుర్రాడు యమలోకం వెళ్తాడు. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. ఓ శుభముహూర్తాన అతను ప్రేమలోపడ్డాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. భూలోకంలోని కుర్రాడికీ, యముడి గారాలపట్టికీ ప్రేమ బంధం ఎలా పడిందో తెర మీదే చూడాలి.

'అల్లరి'నరేష్ మాట్లాడుతూ...యమ లోకం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి... మా చిత్రానికీ నేపథ్యం ఆ లోకమే. అయితే యముడితో ఓ యువకుడు ఆడిన ఆట ఏమిటనేది మా చిత్రంలో చూడాలి. అలాగే సత్తిబాబు దర్శకత్వంలో అంతకుముందు 'బెట్టింగ్ బంగార్రాజు' చేశాను. ఆ తర్వాత చాలా కథలు చెప్పాడు. చివరకు ఈ సోషియో ఫాంటసీ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. యమలోకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నాం. గంటన్నర సేపు గ్రాఫిక్స్‌ ఉంటాయి. రమ్యకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అన్నారు.

ఆర్‌ఎఫ్‌సీలో నిర్మించిన యముడు ఇంటి సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటివరకూ 40 శాతం టాకీతో పాటు, రెండు పాటలను కూడా చిత్రీకరించారు. ఇప్పుడు కొత్తగా యముడు దర్బార్ సెట్ నిర్మించారు.
అందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. కమర్షియల్‌గా అద్భుతమైన విజయం సాధించే సినిమా అవుతుందనే నమ్మకంతో నిర్మాత ఉన్నారు.

రిచాపనయ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నరేష్, అలీ, గిరిబాబు, సయాజీషిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రమ్యకృష్ణ, సుధ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాణం: ఫ్రెండ్లీ మూవీస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X