లేడీ డాన్ తో పెళ్లి..బాబుకి బ్యాండ్ ('జేమ్స్‌బాండ్' ప్రివ్యూ)
హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ సినిమాలు ఏమీ భాక్సాఫీవ్ వద్ద వర్కవుట్ కావటం లేదు. రొటీన్ పాయింట్లు, అవే పంచ్ లు, ప్యారెడీలతో రావటం, కథని నెగ్లెట్ చేయటం ఈ సినిమాలకు మైనస్ గా మారాయి. అయితే ఈ సారి వాటిని అధిగమిస్తూ చక్కటి కథతో ఆద్యంతం నవ్వించటానికి వస్తున్నానంటున్నారు అల్లరి నరేష్. ఈ చిత్రంపై ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు. 'జేమ్స్‌బాండ్' నరేష్ 49వ చిత్రం. ఈ రోజు( 24న) 'జేమ్స్‌బాండ్' తెరపై వినోదాలు పంచడానికి సిద్ధమైంది.
ఈ సినిమాలో రక్తం చూస్తే కళ్లు తిరిగిపడిపోయేంత భయస్తుడు అల్లరి నరేష్. అలాంటి అబ్బాయికి రక్తం చూస్తే తప్ప నిద్రపట్టని ఓ లేడీడాన్‌తో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అనేదే స్టోరీ లైన్.

అనీల్ సుంకర మాట్లాడుతూ..." గుడ్ ప్రొడక్టు తీసుకురావటానికి రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేసిన జేమ్స్ బాండ్ యునిట్ అందరి కీ ధాంక్స్ . ఫైనల్ ప్రొడక్టు చూసాను. జేమ్స్ బాండ్ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది. ఇది బాహుబలి కాదు భర్త బలి " అన్నారు.
ఈ చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘'మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందింది. అల్లరి నరేష్ కామెడి ప్రేక్షకులకు మంచి కామెడి టానిక్ అవుతుంది. అలాగే సాక్షి చౌదరి చక్కగా నటించింది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్.
అలాగే సాయికిషోర్ గారు చక్కగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతానందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం'' అన్నారు.
బ్యానర్ :ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.
నటీనటులు: అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం.
మాటలు: శ్రీధర్ సీపాన,
పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర,
ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ,
డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
కెమెరా: దాము నర్రావు,
సంగీతం: సాయి కార్తీక్,
కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర,
ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి,
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర,
సమర్పణ: ఎ టీవీ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.
విడుదల తేదీ: జూలై 24,2015.


Click it and Unblock the Notifications











