అల్లరి నరేష్ ట్రైలరే ...కానీ అల్లరి నరేష్ ఏడి? (వీడియో)
హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. . ‘నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సందర్బంగా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో హీరో ఒకే ఒకే షాట్ లో ఉండటం ఆశ్చర్యకరం. దాన్ని బట్టి ఈ చిత్రం పూర్తిగా హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అని అర్దమవుతోంది. అయితే ఆమె చేత చెప్పించిన డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సాయి కిషోర్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సాక్షి చౌదరి జంటగా నటించిన 'జేమ్స్ బాండ్' చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. స్థానిక రావినారాయణ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీనటులు శ్రీకాంత్, నాని, తనీష్, సినీ దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘'మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆరు పాటలుంటాయి. అన్నీ డిఫరెంట్ సాంగ్స్. పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది.సాయి కార్తీక్ అద్భుతైమన సంగీతాన్నందించారు. '' అన్నారు.

ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.


Click it and Unblock the Notifications











