twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ 'కెవ్వు కేక' స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లరి నరేష్‌ హీరో గా నటిస్తున్న చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాండ్రే హీరోయిన్ గా నటించింది. దేవిప్రసాద్‌ దర్శకుడు. ఈ నెలలో పాటలు విడుదల చేస్తారు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌. ఈ చిత్రం పూర్తి కామెడీతో రూపొందుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

    ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే... హీరో...తను మనసిచ్చిన మగువతో జీవితం పంచుకోవాలనుకుంటాడు. ఆమె కూడా అతని ప్రేమను ఏక్సెప్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ట్విస్ట్ అమ్మాయి తండ్రి వైపు నుంచి వచ్చింది. ఆయన తనకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో చెప్పే చిట్టా తెరిచాడు. మరి ఇతగాడికి ఆ అర్హతలున్నాయా? వాటిని సాధించేందుకు ఎన్ని పాట్లుపడ్డాడో తెర మీదే చూడాలి.

    నిర్మాత మాట్లాడుతూ.. ''నరేష్‌ - దేవిప్రసాద్‌ కలయికలో వచ్చిన 'బ్లేడు బాబ్జీ'ని మించిన వినోదం ఇందులో ఉంది. ప్రేమను గెలిపించుకొనేందుకు హీరో చేసే విన్యాసాలు వినోదాన్ని పంచుతాయి. బ్యాంకాక్‌లో ప్రధాన తారాగణంపై చిత్రించిన సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ 'నరేష్ పాత్ర వైవిద్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం పూర్తి వినోదభరితంగా ఉంటుందని' తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే ఈచిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. నరేష్, షర్మిల మాంద్రే, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.

    English summary
    Allari Naresh and Sharmila Maandrey starrer 'Kevvu Keka' film became the talk of the town. 'Blade Babji' fame Devi Prasad is the director. Boppana Chandra Sekhar produces and Smt. Neelima presents the film under Jahnavi Productions banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X