అల్లరి నరేష్ శీలవంతుడుగా మిగిలాడా?
పెళ్లయ్యేవరకూ తను శీలవంతుడిగానే ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటాడు అల్లరి నరేష్. అయితే అతని వ్రతభంగం చేయడానికి మితృబృందం ప్రయత్నాలు చేస్తూంటారు. వాటికి దూరంగా ఉండటానికి నరేష్ పడే పాట్లు.. అన్నీ వినోదభరితంగా ఉంటాయి.ఇలా కష్టపడ్డ నరేష్ చివరకు శీలవంతుడుగా మిగిలాడా...అన్నది తమ 'రాంబాబుగాడి పెళ్లాం' (వాడికి ఆ ఫీలింగే లేదు) అనే చిత్రం చూసి తెలుసుకోవాలి అంటున్నారు నిర్మాతలు. ఇంతకుముందు నరేష్ నటించిన 'అల్లరి' ,'జూనియర్స్' చిత్రాల కోవలో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని హామీ ఇస్తున్నారు.
బెండు అప్పారావు విజయంతో మళ్ళీ ఫామ్ లోకి అల్లరి నరేష్ రావటంతో అతని పాత సినిమా ఒకదాన్ని దుమ్ముదులిపి ముందుకు తోస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ చిత్రం గురించి వినపడుతోంది. నరేశ్, గజాలా జంటగా సితార ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎం వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ఈనెల 26న విడుదల కానున్నది. కాపుగంటి రాజేంద్ర దర్శకుడు. ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో స్రోనాలీ జోషీ, గీతాసింగ్, కౌసల్య, జ్యోతి, ప్రదీప, అలీ, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కనిపిస్తారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం: కమలాకర్, సినిమాటోగ్రఫీ: రామ్ పినిశెట్టి, ఎడిటింగ్: గౌతంరాజు సమకూర్చారు.


Click it and Unblock the Notifications











