మడతకాజా తినిపిస్తానంటున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ ...ప్రేక్షకులను మడతకాజా తినిపించేందుకు సిద్దపడుతున్నారు. నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సీతారామరాజు అనే అసెస్టెంట్ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని గతంలో టాస్, అధినేత చిత్రాలను నిర్మించి ప్రస్తుతం వరుణ్ తో ఏమైంది ఈ వేళ చిత్రాన్ని నిర్మిస్తున్న రాదామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో నరేష్...బ్లఫ్ మాస్టర్ తరహాలో వుండే పాత్రను చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం నరేష్...కత్తి కాంతారావు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క వీరభధ్రంని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న అహనా పెళ్ళంట చిత్రంలోనూ నరేష్ చేస్తున్నారు.
అల్లరి నరేష్ అహనా పెళ్ళంట మడతకాజా కత్తి కాంతారావు ఇవివి allari naresh ahana pellanta madatha kaja katti kantha rao evv


Click it and Unblock the Notifications