»   » అల్లరి నరేష్ కొత్త సినిమా షురూ (ఫోటోలు)

అల్లరి నరేష్ కొత్త సినిమా షురూ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా కొత్త సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. 'వీడు తేడా' ఫేం చిన్ని దర్వకత్వం వహించనున్నారు. ఫిల్మ్ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకుడు వివి వినాయక్, నటుడు హర్షవర్ధన్ రాణె హజయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నరేష్ సోదరుడు రాజేష్ క్లాప్ కొట్టారు.

ఇవివి సత్యనారాయణ సమర్పణలో కె. అమ్మిరాజు సిరి సినిమా బేనర్లో ప్రొడక్షన్ నెం.2గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేసవి సెలవులను పురస్కరించుకుని మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లరి నరేష్ మార్కు కామెడీతో పాటు విభిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు...

ముహూర్తపు సన్నివేశం

ముహూర్తపు సన్నివేశం


ఇవివి సత్యనారాయణ సమర్పణలో సిరి మీడియా బేనర్లో ప్రొడక్షన్ నెం.1గా కె. అమ్మిరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజేష్ క్లాప్ కొట్టారు.

కెమెరా స్విచాన్

కెమెరా స్విచాన్


వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే ముళ్ల విజయ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై కెమెరా స్విచాన్ చేసారు.

వివి వినాయక్

వివి వినాయక్


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివి వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి కథ: విక్రమ్ రాజ్, రచన సహకారం: అనిల్ రావిపూడి, సంగీతం : శేఖర్ చంద్ర, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, ఎడిటింగ్: గౌతం రాజు, స్టిల్ష్ : ఇవివి గిరి, ఆర్ట్ : సుబ్బారావు, జెవి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పిఆర్ఓ : వంశీ శేఖర్, మేకప్: సురేష్, కాస్ట్యూమ్స్ : మనోజ్ కుమార్, నిర్వాహణ: బాలకృష్ణ ఇంటూరి, కో-డైరెక్టర్: సురేష్.ఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, నిర్మాత: అమ్మిరాజు కాసుమల్లి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చిన్ని.

English summary
Allari Naresh’s new movie launched. The muhurtham ceremony of this film was held today and regular shooting is expected to commence next month. Chinni, who directed the film ‘Veedu Theda’, is the director of this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu