twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ కొత్త చిత్రం ‘జంప్ జిలానీ’

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లరి నరేష్ మరో కొత్త చిత్రం కమిటయ్యారు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 'జంప్ జిలానీ' అనే టైటిల్ పెట్టారు. అంబికా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరు కాంబినేషన్ లో నేను, బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు చిత్రాలు రూపొందాయి.

    ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన 'యాక్షన్‌' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అల్లరి నరేష్‌, వైభవ్‌, శ్యాం, రాజు సుందరం ప్రధాన పాత్రల్లో రూపొందిన త్రీడీ చిత్రం 'యాక్షన్‌'. నీలం ఉపాధ్యాయ, స్నేహ ఉల్లాల్‌, కామ్న జఠ్మలానీ, షీనా, రీతూబర్మేచ నాయికలు. అనీల్‌ సుంకర దర్శకుడు. సుంకర రామబ్రహ్మం నిర్మాత.

    అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో ఒక్కో సన్నివేశాన్ని తీయడానికి చాలా కష్టపడ్డాం. త్రీడీ స్టీరియోగ్రాఫర్‌ కీత్‌డ్రైవర్‌ ఒక్కోసారి సన్నివేశం నచ్చక ఇరవై సార్లు వన్‌మోర్‌ అనేవాడు. సినిమా నాణ్యతతో తీయాలనే అలా చేశాడు. సినిమాను 12 నెలలు చిత్రించాం. ఇందులో 9 నెలలు కీత్‌ మాతో పని చేశాడు. 'ప్రేమయుద్ధం'లోని స్వాతీ ముత్యపు జల్లులలో పాట అంటే నాకు ఇష్టం. దీన్ని ఈ సినిమాలో యథాతథంగా వాడుకొన్నాము''అన్నారు .

    ''మేము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. నా దర్శకత్వంలో తొలి సినిమానే త్రీడీలో చేయాలని నేను అనుకోలేదు. ఏదైనా గుర్తుండిపోయే చిత్రం తీయాలనే కోరికే నాతో ఈ త్రీడీ సినిమా తీయించింది. బప్పీ-బప్పాలహరి సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయబోతున్నాము''అన్నారు దర్శకుడు.

    కీత్‌డ్రైవర్‌ మాట్లాడుతూ ''తెలుగులో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తీయాలనే ఆలోచనతో ఈ సినిమాకి కష్టపడ్డాను. ఆశించినట్లుగానే సినిమా బాగా వచ్చింది. చిత్రబృందమంతా బాగా సహకరించారు. సినిమా విజయం సాధిస్తుంది''అన్నారు.

    ఈ సినిమాలో సుదీప్‌, నాజర్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, లక్ష్మీ, ఝాన్సీ, తదితరులు నటిస్తున్నారు. సంగీతం: బప్పా-బప్పీలహరి, కథ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, పడాల, ఉపేంద్ర, పాటలు: వేటూరి, భువనచంద్ర, రామజోగయ్య శాస్త్రి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికపాటి, సహ నిర్మాతలు: లక్ష్మారెడ్డి దొంతిరెడ్డి, అజయ్‌ సుంకర

    English summary
    
 Allari Naresh is all set to team up with director E Satti Babu for the fourth time in his career. Now, they are gearing up for yet another comedy film and buzz is that ‘Jump Jilani’ is the title under consideration. Ambica Krishna is going to produce the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X