'గబ్బర్ సింగ్' డైలాగుకి అల్లరి నరేష్ ప్యారెడీ ఇదే
అల్లరి నరేష్ తాజాగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ ని స్పూఫ్ చేస్తున్నట్లు సమాచారం. అందులోని పెద్ద హిట్ డైలాగ్ 'నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది'ని తన తాజా చిత్రం సుడిగాడులో పారడీ చేస్తున్నారు. ఆ డైలాగ్ ఇలా సాగుతుంది..."నాకో కుక్క ఉంది, దానికో బొక్క ఉంది". ఇలా ఆ చిత్రంలో మరికొన్ని డైలుగులను,మ్యానరిజంలను తన సుడిగాడు చిత్రంలో స్పూఫ్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం ఈ నెలలో విడుదల చేయనున్నారు.
'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్.డి.రెడ్డి నిర్మాత.మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ పాడుతున్నారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్.


Click it and Unblock the Notifications











