Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ రిలీజ్ వాయిదా
హైదరాబాద్ : అల్లరి 'నరేష్, రిచాపనయ్ నాయకానాయికలుగా ఇ సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న 'యముడికి మొగుడు' చిత్రం విడుదల వాయిదా పడింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని డిసెంబర్ 27న లేదా 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
గతంలో ఈచిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పోస్టు ప్రొడక్షన్ పనులుకాస్త లేటవడం, థియేటర్ల సమస్య తదితర కారణాల వల్ల ఈచిత్రం మరో వారం రోజులు ఆలస్యంగా విడుదలవుతోంది. 21న చాలా సినిమాలు విడుదల ఉండటంతో కాస్త ఆలస్యంగా విడుదలైతేనే మేలనే ఆలోచన చేసారు నిర్మాతలు.
సినిమా ఎలా ఉంటుందనే విషయానికొస్తే...విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీకి వినోదాన్ని మేళవించి రూపొందిచిన చిత్రమిది. అల్లరి నరేష్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈచిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, రమ్య కృష్ణ, నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి కథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయాగ్రహణం, కె. రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కిరణ్ కుమార్, ఫైట్స్: గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ చౌదరి, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చంటి అడ్డాల, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు.