Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఊసరవెల్లి, దూకుడలపై కామిడి హీరో గుప్పిస్తున్న సెటైర్లు...!?
గతంలో శుభాకాంక్షలు, సుస్వాగతం,సూర్య వంశం వంటి సూపర్ హిట్స్ అందించిన దర్సకుడు భీమినేని శ్రీనివాస రావు మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు..అయితే ఈసారి స్టారో హీరోతో కాకుండా కామిడి హీరోని ఎంచుకున్నాడు. రీమేక్ ల స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు 'తమిళపటం" అనే తమిళ మూవీని అల్లరి నరేష్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ఇందులో 'దూకుడు", 'ఊసరవెల్లి" చిత్రాలపై బోలెడన్ని సెటైర్లు వుంటాయని తెలుస్తోంది. 'ఊసరవెల్లి"లో జూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ 'కరెంట్ తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది..ముట్టుకుంటే దానమ్మ షాకే.."ఈ డైలాగ్ ఈ సినిమాలో అల్లరి నరేష్ చెప్తాడట. ఆ వెంటనే దానికి కౌంటర్ వస్తుంది..'మరి కరెంట్ పోతే..." అని. 'జనరేటర్ ఆన్ చేస్తాం.." అంటూ అల్లరి నరేష్ డైలాగ్ ఉంటుంది. ఇలాంటి సెటైర్లతో ఆడియన్స్ ని నవ్వించే ప్రయత్నం చేయబోతున్నాడు అల్లరి నరేష్.
కాగా అల్లరి నరేష్ ప్రస్తుతం స్ట్రెయిట్ తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలుగు హీరోలందరూ తమిళంలో తమ సత్తా చూపించి అక్కడ మార్కెట్లో సెటిలవ్వాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ శక్తితోనూ,రామ్ చరణ్ మగధీర తోనూ,అల్లు అర్జున్ బద్రీనాధ్ లతోనూ ప్రయత్నించారు కానీ వర్కవుట్ కాలేదు.ఇప్పుడు ఆ రూటులో అల్లరి నరేష్ ప్రయత్నిస్తున్నాడు .అయితే స్టైయట్ తమిళ సినిమా చేస్తున్నాడు. శంభో శివ శంభో చిత్రంలో అల్లరి నరేష్ ఫెరఫార్మెన్స్ చూసిన సముద్రఖని తన తాజా చిత్రంలో హీరోగా ఆఫర్ ఇచ్చాడని సమాచారం.