'జంబలకిడి పంబ’కు సీక్వెల్ గా ‘పంబలకిడి జంబ’
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్ (విజయనిర్మల కొడకు) హీరోగా రూపొందిన 'జంబలకిడి పంబ" చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నరేష్ కు జంటగా ఆమని నటించిన ఈ చిత్రం చాలా తక్కువ బడ్డెట్ తో రూపొంది, నిర్మాతకు, కొనుగోలుదారులకు లాబాల పంట పండించింది. ఈ చిత్రానికి 'జంబలకిడి పంబ" అనే పేరును రివర్స్ చేసి 'పంబలకిడి జంబ" అని పెడుతున్నారు.
'జంబలకిడి పంబ" లో సీనియర్ నరేష్ హీరో అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందనున్న ఈ చిత్రం ఇవివి సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ హీరోగా నటించనుండడం విశేషం. జంబలకిడి పంబ" జంట నరేష్, ఆమని కూడా 'పంబలకిడి జంజ" చిత్రంలో నటించే అవకాశముందని తెలుస్తోంది. గతంలో అల్లరి నరేష్ తో 'ప్రాణం" అనే ప్లాప్ సినిమా తీసిన మాజీ మంత్రి మాగంటి బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.
More from Filmibeat
అల్లరి నరేష్ నరేష్ ఆమని జంబలకిడి పంబ ఇవివి సత్యనారాయణ మాగంటి బాబు allari naresh naresh amani jamba lakidi pamba evv satyanarayana maganti babu


Click it and Unblock the Notifications











