twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ రెండుసార్లు అంటే నేను 100 సార్లు అన్నా.. చాలా బాధనిపించింది: అల్లరి నరేష్

    |

    ఇటీవలే విడుదలై బాక్సా ఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మహేష్ బాబు మహర్షి మూవీ. దీంతో ఈ సినిమాలో నటించిన నటీనటులంతా ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ మహర్షి సంగతులను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడారు. మహర్షి సినిమాలో తాను పోషించిన పాత్ర గురించి, మహేష్‌తో కలిసి నటించడం వల్ల కల్గిన ఫీలింగ్స్ చెప్పారు నరేష్.

    ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ.. ''నేను ఇప్పటి వరకూ కామెడీ పాత్రలు మాత్రమే చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ టైమ్ నన్ను నమ్మి నాకు మహర్షిలో మంచి పాత్ర ఇచ్చారు మహేష్, వంశీ పైడిపెల్లి. ఈ విషయంలో ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓ పెద్ద స్టార్‌తో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ అనుకుంటే పొరపాటు. అందరు క్యారెక్టర్స్ లాగే నేను కూడా ఇందులో ఓ క్యారెక్టర్ చేశానంతే.

    Allari naresh shares his experience with mahesh babu

    అయితే మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటించిన నాకు ఆయన్ను ఒరేయ్ అనిపిలవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. సినిమాలో మహేష్ బాబు నన్ను రెండుసార్లు ఒరేయ్ ఆంటే నేను మాత్రం మహేష్‌ని 100 సార్లు ఒరేయ్ అనాల్సి వచ్చింది. దీంతో డైరెక్టర్ దగ్గరికెళ్లి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పా. ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉంటారు డోంట్ వర్రీ అని వంశీ అన్నారు. ఇక మహేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా చాలా ఫన్నీగా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఓ పెద్ద స్టార్ అయిన తాను ఒరేయ్ అనిపించుకోవడమేంటని మహేష్ ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఈ లక్షణాలే మహేష్‌ని బిగ్ స్టార్ చేశాయేమో'' అని అల్లరి నరేష్ అన్నారు.

    మహేష్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ సినిమాగా మహర్షి తెరకెక్కింది. వంశీ పైడిపెల్లి టేకింగ్, ముగ్గురు నిర్మాతల నిర్మాణ విలువలు ప్రేక్షక లోకాన్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే కెమిస్ట్రీ చూసి ఫిదా అవుతున్నారు జనం. అలాగే మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ నటన భేష్ అనిపించుకుంటోంది.

    English summary
    Mahesh Babu's Maharshi is running successfully with creating new records in his career. This movie crossed Rs.100 crores already. And this movie is collecting best wishes from indian politicians. Allari naresh shares his experience with mahesh babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X