నువ్వా? నేనా? అంటూ శర్వానంద-నరేష్ ఫైట్!
'గమ్యం' సినిమాలో కోస్టార్స్ గా కలిసి నటించిన అల్లరి నరేష్, శర్వానంద్ మరోసారి కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నువ్వా? నేనా? అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ శ్రియ లీడ్ హీరోయిన్ రోల్ లో కనిపించనుంది. నారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.వి.కె బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అల్లరి నరేష్, శర్వానంద్ ఇద్దరూ శ్రియను ప్రేమిస్తుంటారు. ఒకరికొకరు పోటీగా ఇద్దరూ శ్రియను ప్లాట్ చేసే ప్లాన్లు వేస్తుంటారు. ఈ క్రమంలో సినిమా వినోదాత్మకంగా సాగుతుందని దర్శకుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాగుతోంది.
శర్వానంద్, అల్లరి నరేష్ కలసి నటించిన 'గమ్యం' అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. హీరో శర్వానంద్ నటించిన జర్నీ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుని 50 రోజుల దిశగా దూసుకెలుతోంది.


Click it and Unblock the Notifications











