»   » అల్లరి నరేష్ వింత కోరిక..ఆ విలన్ అమ్మాయి అయితే పెళ్లి చేసుకునే వాడట, అంత పిచ్చి ఎందుకంటే!

అల్లరి నరేష్ వింత కోరిక..ఆ విలన్ అమ్మాయి అయితే పెళ్లి చేసుకునే వాడట, అంత పిచ్చి ఎందుకంటే!

Subscribe to Filmibeat Telugu

కామెడీ హీరోగా దూసుకుపోతున్న అల్లరి నరేష్ కెరీర్ ప్రస్తుతం నెమ్మదించింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో సందడి చేసే అల్లరి నరేష్ ఇప్పుడు బాగా వెనుకబడిపోయాడు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ కు సరైన విజయాలు దక్కకపోవడమే. కానీ అభిమానులని తన కామెడీ టైమింగ్ తో నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాగా ఓ ఇంటర్వ్యూ లో అల్లర నరేష్ వెల్లడించిన వింత కోరికకు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 ఏడాదికి మూడు సినిమాలతో జోరు

ఏడాదికి మూడు సినిమాలతో జోరు

ఆరంభంలో అల్లరి నరేష్ వరుస విజయాలతో దూసుకునిపోయాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ థియేటర్ లలో రచ్చ చేసేవాడు.

వెనుకబడిపోయాడు

వెనుకబడిపోయాడు

అల్లరి నరేష్ ఇప్పుడు కెరీర్ పరంగా బాగా వెనుకబడిపోయాడు. సరైన విజయాలు దక్కకపోవడంతో అల్లరి నరేష్ కెరీర్ బాగా డల్ అయింది.

 కామెడీ హీరో ఎలా అయ్యానో

కామెడీ హీరో ఎలా అయ్యానో

యాక్షన్ ఇన్స్టిట్యూట్ లో కామెడీ ఎలా చేయాలో అసలు నేర్పించలేదని నరేష్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. అలాంటిది కామెడీ హీరో అయ్యానంటే నాకే అర్థం కావడం లేదని నరేష్ తెలిపాడు.

రఘువరన్ అంటే పిచ్చి

రఘువరన్ అంటే పిచ్చి

తనకు చిన్న నాటి నుంచి రఘువరన్ నటన అనే పిచ్చి అని అల్లరి నరేష్ తెలిపాడు. శివ సినిమాలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయా అని నరేష్ తెలిపాడు.

 అమ్మాయి అయివుంటే

అమ్మాయి అయివుంటే

రఘువరన్ కనుక అమ్మాయి అయి ఉంటె ఆయన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడినని, ఆయన అంటే అంత అభిమానం అని నరేష్ తెలిపాడు.

English summary
Allari Naresh shocking desire on Raghuvaran. He is big fan of Raghuvaran acting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu