భారీ సెట్టింగులతో అల్లరి నరేష్ కొత్త చిత్రం
అల్లరి నరేష్ కథానాయకుడుగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై ధనలక్ష్మి అడ్డాల సమర్పరణలో నిర్మాత చంటి అడ్డాల నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ప్రొడక్షన్ నెం.9 షూటింగ్ ప్రారంభోత్సవం ఈ నెల 25న రామోజీ ఫిలింసిటీలో జరగనుంది. ఈ విషయాలన్ని నిర్మాత చంటి అడ్డాల తెలియజేస్తూ 'ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా చిత్ర నిర్మాణానికంటే ముందే గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టాం. ఈ చిత్రం కోసం మొత్తం 8 భారీ సెట్టింగులు నిర్మించనున్నాం.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని రామోజీ ఫిలింసిటీలో సెట్ నిర్మాణ పనులు మొదలు పెట్టాం. ఇప్పటికే ఒక పాటను రికార్డ్ చేశాం. మిగిలిన పాటలకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. నరేష్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం కథ డిమాండ్‌కు అనుగుణంగానే అంత బడ్జెట్‌ను వినియోగిస్తున్నాం. గ్రాఫిక్స్ తో పాటు సెట్స్ కూడా హైలెట్ గా ఉంటాయి. రామోజీ ఫిలింసిటీలో 60 రోజుల పాటు రెండు భారీ షెడ్యూల్స్ చేస్తాం. ఒక షెడ్యూల్‌ను పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చేస్తాం. హీరోయిన్‌తో పాటు మిగిలిన వివరాలను ప్రారంభోత్సవం సందర్భంగా తెలియజేస్తాం' అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రాత్రల్లో బ్రహ్మానందం, సీనియర్ నరేష్, ఆలీ, గిరిబాబు, షియాజీషిండే, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, చలపతిరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, భరత్, రమ్యకృష్ణ, సుధ, హేమ, సన, రజిత, పృథ్వీ, పిళ్లా ప్రసాద్, 'తాగుబోతు' రమేష్, దువ్వాసి మోహన్, ధనరాజ్, ఫిష్ వెంకట్, కాదంబరి కిరణ్, సారిక రామచంద్రరావు, బోస్ తదితరులు తారాణంగా నటిస్తున్నారని తెలిపారు.
ఈ చిత్రానికి మూలకథ: జయ సిద్దు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయా గ్రహణం: కె. రవీంద్రబాబు, ఆర్ట్: కిరణ్ కుమార్ ఎం, ఎడిటింగ్: గఃతం రాజు, ఫైట్స్: విజయ్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామన్ చౌదరి, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చండి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు


Click it and Unblock the Notifications











