నాన్న ఉంటే గర్వపడేవారు, అరవాలపించింది: ‘మహర్షి’ సక్సెస్ మీట్లో అల్లరి నరేష్ భావోద్వేగం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్; పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాకు ఇలాంటి పాత్ర ఏమిటి? అని ఆశ్చర్యపోయాను

నాకు ఇలాంటి పాత్ర ఏమిటి? అని ఆశ్చర్యపోయాను

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘వంశీగారు ఫోన్ చేసి మహేష్ బాబు సినిమా గురించి కలవాలని చెప్పినపుడు నాకు అర్థం కాలేదు. మహేష్ గారి సినిమాలో నేనేంటి? ఏదైనా మంచి కామెడీ పాత్ర ఉంటుందేమో? అనుకుకున్నాను. ఆయన ఒక 20 నిమిషాల నేరేషన్ ఇచ్చిన తర్వాత ఈ కథలో నన్ను ఎలా ఊహించుకుంటారు? అని అడిగాను.'' అని అల్లరి నరేష్ గుర్తు చేసుకున్నారు.

సీరియస్ పాత్రలు చేయగలడు అని నమ్మి ఇచ్చినందుకు వారికి కతజ్ఞతలు

సీరియస్ పాత్రలు చేయగలడు అని నమ్మి ఇచ్చినందుకు వారికి కతజ్ఞతలు

ఎందుకంటే నేను ఇప్పటి వరకు కామెడీ పాత్రలు చేశాను. నాకు ఇలాంటి పాత్ర ఇవ్వడం ఏమిటి? అని ఆశ్చర్యం వేసింది. మహేష్ గారే నన్ను ఈ పాత్రకు తీసుకోమన్నారని చెప్పినపుడు సంతోషం అనిపించింది. కామెడీ పాత్రలు చేసే నన్ను సీరియస్ పాత్రలు చేయగలడు అని నమ్మి ఇచ్చినందుకు వారికి కతజ్ఞతలు.

పర్ఫెక్షన్ అనేదానికి మహేష్ నిదర్శనం

పర్ఫెక్షన్ అనేదానికి మహేష్ నిదర్శనం

ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపిగారి లాంటి టాప్ బేనర్లలో చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. మహేష్ బాబుగారితో చేయడం ఒక అద్భుతమైన అనుభూతి.. ఆయన కాలేజీ ఎపిసోడ్ చేసేపుడు సరదాగా ఉండేవారు, సీరియస్ సీన్ చేసేపుడు ఆ రోజంతా అదే మూడ్లో ఉండేవారు. పెర్ఫెక్షన్ అనేదానికి ఆయన ఒక నిదర్శనం.

మా నాన్న ఉంటే గర్వపడేవారు

మా నాన్న ఉంటే గర్వపడేవారు


ఈ రోజు మా ఫాదర్(ఇవివి సత్యరానాయణ) ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవారు అనిపిస్తోంది. ఎందుకంటే... ఒక దర్శకుడిగా గర్వపడేవారు, ఆయన దర్శకుడిగా కంటే ముందు రైతు, రైతుగా ఇంకా గర్వపడేవారని నరేష్ చెప్పుకొచ్చారు.

కొన్ని సినిమాలకే రెస్పెక్ట్ వస్తుంది, వెళ్లి అరవాలనిపించింది

కొన్ని సినిమాలకే రెస్పెక్ట్ వస్తుంది, వెళ్లి అరవాలనిపించింది

మనం చాలా సినిమాలు చేస్తాం...పేరు వస్తుంది, కానీ రెస్పెక్ట్ అనేది కొన్ని సినిమాలకే వస్తుంది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు చాలా ఫోన్లు వచ్చాయి. హిట్ అనే పదం నేను విని నాలుగు సంవత్సరాలైంది. ఆ సంతోషంలో ఎక్కడికైనా వెళ్లి అరవాలనిపించింది. అప్పుడు అనిపించింది... సక్సెస్‌కు కామాలు మాత్రమే ఉంటాయి, పులిస్టాపులు ఉండవు అని'' అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X