Aa Okkati Adakku Twitter Review: అల్లరి నరేష్ మూవీకి ఊహించని టాక్.. ఆ ఒక్కటీ అడక్కు హిట్టా? ఫట్టా?
టాలీవుడ్‌లో చాలా మందే హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే కామెడీ హీరోలుగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో అల్లరి నరేష్ ఒకడు. కెరీర్ మొదలెట్టిన తర్వాత వరుసగా వినోదాత్మక చిత్రాలను చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం సీరియస్ మూవీలు చేస్తున్నాడు.
కానీ, సరైన హిట్లను అందుకోవట్లేదు. దీంతో మరోసారి కామెడీ పంథాలోకే వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు' అనే మూవీ చేశాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి!

ఆ ఒక్కటీ అడక్కు అంటూ
విలక్షణ నటుడు అల్లరి నరేష్ నటించిన లెటెస్ట్ మూవీనే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు.

అలాంటి స్టోరీతో వచ్చింది
పెళ్లీడు వచ్చినా వివాహం చేసుకోని ఓ కుర్రాడికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? సమాజంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరికి ఇష్టపడిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది.
ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అల్లరి నరేష్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ప్రదర్శన ఇప్పటికే పూర్తైంది. దీన్ని చూసిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో ఇలా స్పందించారు. 'ఆ ఒక్కటీ అడక్కు సినిమా ఫస్టాఫ్ ఇప్పుడే చూశాను. ఇది బిలో ఏవరేజ్‌గా ఉంది. మంచి సెకెండాఫ్ ఈ సినిమాకు అవసరం ఉంది' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఎందుకు తీశారు
మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీని చూసిన మరో నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. 'అసలు ఎందుకు తీశారు? ఏం తీశారు? ఏం తీయాలనుకున్నారు? అనే డౌట్ వస్తుంది ఈ సినిమాను చూస్తుంటే' అంటూ రాసుకొచ్చారు.
రైటింగ్ బాగోలేదు అంటూ
అల్లరి నరేష్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'ఆ ఒక్కటీ అడక్కు మూవీలో చెప్పుకోదగ్గ కథాంశం తప్ప మంచి పాజిటివ్ అంశాలు లేవు. ప్రజెంటేషన్, రైటింగ్ ఆశించినంతగా లేవు. మెమరబుల్ 90స్ టైటిల్‌ను సరిగా ఉపయోగించలేకపోయారని చెప్పొచ్చు. ఈ టైటిల్ పెట్టి తప్పు చేసినట్లు అనిపించింది' అని వెల్లడించారు.
నరేష్ మరో ఛాన్స్ మిస్
చాలా కాలంగా భారీ హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటీ ఆడక్కు' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో 'అల్లరి నరేష్‌కు ఇంకో సినిమా మిస్ అయింది. స్టోరీ బాగానే ఉన్నా తీసే విధానం మాత్రం బాగాలేదు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఓవరాల్‌గా అలాంటి టాక్
టాలీవుడ్ విలక్షణ నటుడు అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు అన్నీ కాస్త నెగెటివ్‌గానే ఉన్నాయి. అయితే, కొందరు మాత్రం ఈ మూవీ ఏవరేజ్‌గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఈ చిత్రానికి ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు. మరి మౌత్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











