Ugram Twitter Review: ఉగ్రం మూవీకి ఊహించని టాక్.. అంతా బాగుంది కానీ.. నరేష్ హిట్ కొట్టాడా అంటే!
టాలీవుడ్‌లోకి బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా తనదైన శైలి చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. దీనికితోడు వేగంగా సినిమాలు చేస్తూ ఎప్పుడో అర్ధ సెంచరీని కూడా దాటేశాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సీరియస్ సినిమాలను చేస్తోన్న అతడు.. 'నాంది' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్‌లో 'ఉగ్రం' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి దీనికి ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూద్దామా!
'ఉగ్రం' అంటూ వచ్చేశాడు:ఈ మధ్య సీరియస్ చిత్రాలు చేస్తోన్న అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఉగ్రం'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీలో మీర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుంచారు. ఇందులో ఇంద్రజ, శత్రు తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఇచ్చాడు.

అలాంటి కథ... ఉగ్రరూపంతో:'ఉగ్రం' సినిమా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మిస్టరీ కేసును చేధించే క్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడంతో పాటు కుటుంబాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత అతడు ప్రత్యర్థులపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో తెరకెక్కింది. ఇందులో నరేష్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపాన్ని చూపించాడు.
ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉందని:అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. 'ఉగ్రం సినిమా ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. మొదటి భాగం మొత్తం ఆసక్తికరమైన కథాంశంతో సాగుతుంది. ప్రారంభంలో సెటప్ అంతా బాగుంది. కానీ, డల్ రొమాంటిక్ ట్రాక్‌తో పాటు వెంట వెంటనే వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సెకెండాఫ్ భారీగా ఉండాలి' అని చెప్పాడు.
గూస్‌బమ్స్ వచ్చేలా ఉంది:విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలెంటెడ్ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటించిన 'ఉగ్రం' సినిమాను చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'ఉగ్రం ఎక్స్‌లెంట్ మూవీ. తప్పకుండా చూసే సినిమా. ఈ మూవీలో అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపించాడు. మొత్తంగా ఇది గూస్‌బమ్స్ తెప్పించే విధంగా సాగుతుంది' అని అందులో చెప్పుకొచ్చాడు.
సెకెండాఫ్ ప్రాణం పోసింది:అల్లరి నరేష్ హీరోగా చేసిన 'ఉగ్రం' సినిమాను వీక్షించిన మరొక నెటిజన్ ట్విట్టర్‌లో 'స్లోగా సాగే ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. రెండో భాగం మాత్రం ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో, మిస్టరీని చేధించే కథలో మరింత లోతుగా సాగుతుంది. మొత్తం ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ సూపర్‌గా ఉంది. నరేష్ నటన, పాప యాక్టింగ్, ఫైట్లు, సినిమాటోగ్రఫి, బీజీఎం బాగున్నాయి' అన్నాడు.
అల్లరి నరేష్ అదరగొట్టాడు:నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమాను చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'అల్లరి నరేష్ ఈ సినిమా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అదరగొట్టేశాడు. కానీ, కొన్ని మాస్ సీన్లలో అతడి డైలాగ్ డెలివరీ ఎందుకనో సింక్ కాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా ఫ్లోను ఇబ్బంది పెట్టిన పాటల ప్లేస్‌మెంట్‌ను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది' అని రాసుకొచ్చాడు.
అంతా బాగుంది కానీ అని:నరేష్ - విజయ్ కనకమేడల కాంబోలో వచ్చిన 'ఉగ్రం' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'ఉగ్రం ఒక మిస్టరీ థ్రిల్లర్. ఇది ఆసక్తికరమైన కథాంశంతో పాటు మంచి సెటప్‌తో నడుస్తుంది. కానీ, చాలా వరకూ ప్రజెంటేషన్‌లో తడబడింది. కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి కానీ.. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్, డల్ రైటింగ్ ఫ్లోను నాశనం చేశాడు. ఓవరాల్‌గా ఏవరేజ్' అన్నాడు.

ఫైనల్‌గా టాక్ ఎలా ఉంది:'ఉగ్రం' మూవీకి సంబంధించిన షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు ప్రకారం.. ఈ సినిమాకు దాదాపుగా మంచి టాక్ వచ్చింది. అయితే, ఇందులో అనవసరంగా వచ్చే కమర్షియల్ హంగులు కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, రొమాంటిక్ ట్రాక్‌తో పాటు పాటల ప్లేస్‌మెంట్ బాలేదని అంటున్నారు. మొత్తంగా నరేష్ విశ్వరూపం కోసం చూడచ్చని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











