అల్లరి నరేష్ 'ఒక టిక్కెట్‌ పై వంద సినిమాలు'

By Srikanya

నరేష్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత. మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్‌ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ పాడుతున్నారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది.

తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం ఈ వేసవికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన చిత్రాలన్నిటిని ఈ చిత్రంలో హీరో పేరడీ చేస్తారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X