అల్లరి నరేష్, సునీల్ మూవీ ‘సిల్లీ ఫెల్లోస్’ ఫస్ట్ లుక్
టాలీవుడ్ కామెడీ స్టార్స్ హీరో అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్లో 'సిల్లీ ఫెల్లోస్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదల చేశారు. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో గతంలో 'సుడిగాడు' అనే ఫుల్ కామెడీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా 'సిల్లీ ఫెలోస్' ఉంటుందని అంటున్నారు. ఇందులో సునీల్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

టాలీవుడ్లోని దాదాపు కమెడియన్లు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అల్లరి నరేష్, సునీల్‌కు ఈ మధ్య సరైన హిట్ లేదు. ఇద్దరు కామెడీ స్టార్స్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
బ్లూప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











