నాగార్జున సాంగుకి అల్లరి నరేష్ స్టెప్పేస్తే ఇలా..(ఫస్ట్‌లుక్ ఫోటో)
హైదరాబాద్: నాగార్జున-అమల కలిసి నటించని 'ప్రేమ యుద్ధం' చిత్రంలోని 'స్వాతి ముత్యపు జల్లులలో' పాట అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటను అల్లరి నరేష్ నటిస్తున్న 'యాక్షన్ 3డి' చిత్రంలో రీమిక్స్ చేసారు. ఒరిజినల్ సాంగుకు కన్నడ కంపోజర్ హంసలేఖ కంపోజ్ చేయగా, ఇప్పుడు రీమిక్స్ సాంగుకు బప్పా-బప్పీ లహరి మ్యూజిక్ అందించారు.
యాక్షన్ 3డి చిత్రంలో అల్లరి నరేష్, హీరోయిన్ నీలంలపై ఈ పాటను చిత్రీకరించారు. గాయిత్రి రఘురామ్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. అందుకు సంబంధించిన స్టిల్ ఒకటి నిర్మాతలు బయటకు విడుదల చేసారు. ఇందులో అల్లరి నరేష్ స్టైల్, హీరోయిన్ నీలం నడుము అందాలను సెక్సీగా చూపడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 'యాక్షన్' 3డి చిత్రం రూపొందుతోంది. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మే నెలలో ఈ సినిమా విడుదల కానుంది.
రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications












