అర్థరాత్రి లేపినా సూపర్...అల్లరి నరేష్
అర్థరాత్రి లేపినా 'సినిమా సూపర్ భయ్యా'అనేవాడు.ఆ మాట నిలబెట్టాడని అల్లరి నరేష్ అన్నారు.నరేష్ తాజా చిత్రం 'అహ నా పెళ్లంట' విజయోత్సవ సభను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే...మా నాన్నగారికి అంకితం ఇచ్చిన సినిమా ఇది. ఫలితం ఎలా ఉంటుందో అని కాస్త కంగారుపడ్డాను. మంచి సినిమా తీశారు. ప్రేక్షకులంతా హాయిగా నవ్వుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు నరేష్.
దర్శకుడు వీరభధ్రమ్ మాట్లాడుతూ..మంచి మనుషుల మధ్య పనిచేశాను. నిర్మాతలు సుంకర రామబ్రహ్మం, అనిల్ సుంకరలు అందించిన సహకారం మరచిపోలేనిది. అందుకే ఎప్పుడూ సినిమా ఫలితం మీద బెంగపడలేదు. నటీనటులు, సాంకేతిక సిబ్బంది నాకు కావల్సిన సహకారం అందించారన్నారు. ఈ వేడుకలో రీతు బర్మేచ, అనిల్ సుంకర, శ్రీహరి, సుబ్బరాజు, సామ్రాట్, రఘు కుంచెలు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











