twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు కథలు ఎలా ఉండాలంటే..అల్లరి నరేష్

    By Srikanya
    |

    హాస్యానికి ఆకాశమే హద్దు అనుకొంటారుగానీ...చాలా రకాలుగా హద్దులున్నాయి. అలాంటి కథల్లో హీరో పాత్రధారి అతి తెలివైనవాడో, భయస్తుడో, తింగరోడో, అత్యాశపరుడో, వ్యసనపరుడో అవుతాడు. అతని ప్రవర్తన చుట్టూ కథ అల్లుకోవాలి. ఈ హద్దుల్లోనే ఆరోగ్యకరమైన వినోదాన్ని పుట్టించాలి. అయినా కథ కంటే కథనం కొత్త పంథాలో ఉండాలి అంటూ కామిడీ కథలు గురించి చెప్పుకొచ్చారు. లేటెస్ట్ గా రిలీజై బావుందనిపించుకున్న బెండు అప్పారావు ఆర్.ఎంపి చిత్రం సక్సెస్ గురించి మీడియా తో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.

    ఇక తను చిత్రాలు కమిట్ అయ్యేటప్పుడు ఎలాంటి వాటికి ప్రయారిటీ ఇస్తానన్న దానికి సమాధానంగా..నా సినిమా అనేసరికి ఇంటిల్లిపాదీ చూసి నవ్వుకొనేలా ఉండాలనుకొంటాను. ఎందుకంటే పిల్లలు నా సినిమాలు చూసి హాయిగా నవ్వుకొంటున్నారు. కాబట్టి ద్వంద్వార్థాలు, అభ్యంతరకరమైన దృశ్యాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాను. దర్శకులకీ, రచయితలకీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఈ హద్దులు కూడా ముద్దే. ఎందుకంటే నేటి తరం ప్రేక్షకులు ఆరోగ్యకరమైన వినోదాన్నే ఆశించి థియేటర్‌కి వస్తున్నారు.

    'బెండు అప్పారావు' ఇంతగా ఆడుతోందీ అంటే...కుటుంబ ప్రేక్షకుల ఆదరణే కారణం. మనదైన నేటివిటీతో పుట్టిన హాస్యం అందులో ఉంది అన్నారు. అలాగే తన తరవాత చిత్రం ఏటీవీ సంస్థ నిర్మించే చిత్రం ఒకటి ఉంటుంది. వీరభద్ర చౌదరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X