రాజీవ్ కనకాల,సింధు తులానీ కాంబినేషన్లో 'బ్లాక్ అండ్ వైట్' సినిమా రూపొందించిన వేములపల్లి శ్రీకాత్ మరో సినిమా కమిటయ్యినట్లు తెలుస్తోంది. సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోయినా స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా రాసుకున్నాడని పేరు తెచ్చుకున్నాడు. దాంతో ప్రివ్యూ చూసిన అల్లరి నరేష్ ఆయన్ని పిలిపించినట్లు సమాచారం. ఆయన నరేష్ కి గమ్యం లాంటి రోడ్ జర్నీ సబ్జెక్టు చెప్పాడని సమకాలీన అంశాలను సస్పెన్స్ తో ముడిపెట్టి చెప్పిన ఆ కధ అతనకి నచ్చిందని చెప్తున్నారు. దాంతో తనకు తెలుసున్న నిర్మాతనే పరిచయం చేసాడని త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నాడని సమాచారం. దాంతో టాలెంట్ అనేది ఉంటే ఈరోజు కాకపోయినా మరో రోజైనా వెలుగులోకి రావటం ఖాయమనేది రుజువయ్యిందని అంటున్నారు.
Story first published: Friday, July 17, 2026, 18:13 [IST]