Just In
- 34 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి విషయం డిక్లేర్ చేసిన అల్లరి నరష్
హైదరాబాద్: టాలీవుడ్లోని బ్యాచిలర్ హీరోలంతా ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. గడిచిన రెండు మూడేళ్లుగా జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, గోపీచంద్ తదితరులు ఓ ఇంటి వారయ్యారు. మిగిలిన బ్యాచిలర్ హీరోలు సైతం వివాహానికి సిద్దం అవుతున్నారు.
టాలీవుడ్ కామెడీ స్టార్ హీరో అల్లరి నరేష్ విషయానికొస్తే....అల్లరి నరేష్ ఈ సంవత్సరం పెళ్లి భోజనం పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని అల్లరి నరేష్ ధృవీకరించారు. కుటుంబ సభ్యులు అతడి కోసం సంబంధాలు చూసే పనిలో తలమునకలై ఉన్నారు. అల్లరి నరేష్ అభిరుచికి తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. తనకు మోడ్రన్ ఉంటూ పార్టీలు పబ్బులూ అంటూ తిరిగే అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా చక్కబెట్టే సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ కోరుకుంటున్నాడట.

ఈ మేరకు అల్లరి నరేష్ కోరుకుంటున్న లక్షణాలు ఉన్న అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారట. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్లరి నరేష్‌కు సరిజోడీగల అమ్మాయి కోసం వెతుకుతున్నారట. అమ్మాయిని చూసే బాధ్యతను నటుడు చలపతిరావుతో పాటు, అల్లరి నరేష్ బంధువైన అమ్మిరాజు అనే వ్యక్తి భుజానేసుకున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రథమార్థంలోనే అల్లరోడి పెళ్లి భాజా మ్రోగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బాక్సాఫీసును తన కామెడీ పంచ్ లతో హోరెత్తించిన అల్లరి నరేష్ జోరు ప్రస్తుతం కాస్త తగ్గింది. త్వరలో అల్లరి నరేష్ బందిపోటే అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.