»   » ఊహించని నిర్ణయం: అల్లరి నరేష్ దర్శకత్వంలో మూవీ, రిలీజ్ డేట్ కూడా!

ఊహించని నిర్ణయం: అల్లరి నరేష్ దర్శకత్వంలో మూవీ, రిలీజ్ డేట్ కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ స్టార్ అల్ల‌రి న‌రేష్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నటుడిగా కనిపించిన ఆయన త్వరలో దర్శకత్వం వైపు అడుగులు వేయబోతున్నారు. అది కూడా ఎంతో దూరం లేదు.

2020 మే నెల‌లో అల్లరి నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిలీజ్ కాబోతోంది. కథ, నటీనటులు, నిర్మాత ఇవేవీ ఖరారు కాలేదు... కానీ ఆ సమయానికల్లా అన్ని పూర్తి చేయాలని అల్లరి నరేష్ డిసైడ్ అయ్యాడు.

ప్రముఖ దర్శకుడు, అల్లరి నరేష్ తండ్రి ఈవివి సత్య నారాయణ... తన కొడుకు నరేష్‌ని దర్శకుడు చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా నరేష్ యాక్టింగ్ వైపు వచ్చారు. ఏది ఏమైనా త్వరలో తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చబోతున్నారన్నమాట.

అప్పుడే ఎందుకు అంటే?

అప్పుడే ఎందుకు అంటే?

ఈ విష‌యాలు వెల్లడించింది మరెవరో కాదు... అల్ల‌రి న‌రేషే. అప్పుడే రిలీజ్ చేయడానికి కారణం ఏమిటి? అని అడిగితే.....2020 సౌండింగ్ బాగుంది. మే నెల నాకు బాగా క‌లిసొచ్చింది. అందుచేత 2020 మే నెల‌లో ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను అన్నారు.

ఇంట్లో దెయ్యం నాకేం భయం.

ఇంట్లో దెయ్యం నాకేం భయం.

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా వివరాలు

సినిమా వివరాలు

'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం చిత్రంలో అల్లరి నరేష్‌, కృతిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌లతోపాటు మరో 20 మంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

హీరో అల్లరి నరేష్ కూతురు బారసాల వేడుక... (ఫోటోస్)

హీరో అల్లరి నరేష్ కూతురు బారసాల వేడుక... (ఫోటోస్)

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్, విరూప దంపతుల గారాల కూతురు..... అయానా అవిక ఈదర బారసాల వేడుక ఇటీవల జరిగింది. ఈ మధ్యే తమ కూతురు అయానా ఫోటో పోస్టు చేయడం ద్వారా... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Late EVV Satya Narayana wanted his son Nareh to become his scion and direct films but Naresh chose acting and rose to fame as ‘Allari Naresh’. But after EVV’s demise, Naresh wants to fulfill his dream. The actor in a recent interview revealed that he will try direction soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu