వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో
'వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలన్నది నా చిరకాల వాంఛ. వెండితెరపై వినోదాన్ని పండించడంలో ఆయనది ఓ ప్రత్యేకమైన శైలి. మా కలయికలో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందు భోజనం వడ్డిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను' అని అల్లరి నరేష్ చెప్తున్నారు. ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ కామిడీ చిత్రం రూపొందనున్న సంగతి చాలా కాలంగా అనుకుంటున్నదే. అయితే ఇప్పడది కార్య రూపం దాలుస్తోంది. అయితే ఇది లేడీస్ టైలర్ కి సీక్వెల్ అవునా..కాదా అన్నది మాత్రం తెలియటం లేదు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించనున్నారు.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కుమార్ చౌదరి మీడియాకు వివరిస్తూ.. ' గోపి గోపిక గోదావరి వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వంశీ చేస్తున్న సినిమా ఇది. అలాగే 'బెండు అప్పారావు' విజయంతో నరేష్ కూడా మంచి స్పీడ్‌లో ఉన్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అనగానే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని మించి రీతిలో ఈ సినిమా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. అలాగే వంశీ చక్రి కాంబినేషన్ అనగానే పాటలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం' అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రవి సదాశివుని.


Click it and Unblock the Notifications











