మల్లన్న సేవలో టాలీవుడ్ అల్లరోడు
అల్లరి నరేష్ నటించిన 'యాక్షన్' 3డి సినిమా ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నరేష్ పుణ్యక్షేత్రాలను సందర్శించడం చర్చనీయాంశం అయింది. కెరీర్ బాగా సాగాలని నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన 'యాక్షన్' 3డి చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.
ఈ చిత్రం 2డి తో పాటు 3డిలోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్‌కు వెళ్లనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతీయ సినీ రంగ చరిత్రలో 3డిలో రూపొందిన తొలి కామెడీ చిత్రం ఇదేకావడం విశేషం.
సునీల్, పోసాని ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి.
3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications
