భూమిక వెనకపడుతున్న అల్లరి నరేష్

By Srikanya

హైదరాబాద్ : నార్త్‌సిటీ ప్రాంతంలో భూమిక షాపింగ్‌ చేస్తోంది. అంతదూరం నుంచి అల్లరినరేష్‌ ఆమెను చూస్తున్నారు. ఈ సన్నివేశాలను రవిబాబు కెమెరా కన్నులో పర్యవేక్షిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్ పరిస్థితి ఇది. అల్లరి తర్వాత అల్లరి నరేష్‌, రవిబాబు కలయికలో వస్తున్న ఈ సినిమాలో భూమిక నాయిక. నార్త్‌సిటీ ప్రాంతంలో చిత్రిస్తున్నారు. త్రిపురనేని రాజేంద్ర నిర్మాత. ఈ నెల 20వరకు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది.

అల్లరి నరేష్ ప్రస్తుతం రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 'లడ్డూ బాబు' అనే టైటిల్ ఈచిత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది. టైటిల్‌కు తగిన విధంగానే ఈచిత్రంలో నరేష్ లావుగా, ఓల్డ్ లుక్‌తో కనిపించనున్నాడట. అల్లరి నరేష్ విషయంలో ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని షాకింగ్ లుక్ కోసం...ప్రత్యేకంగా లండన్ నుంచి మేకప్ నిపుణులను రప్పించారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో భూమిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది మామూలు సినిమాల్లా కాకుండా వెరైటీగా, కామెడీ పండించే విధంగా ఉండబోతోందట. ఈ సినిమా లో నరేష్ బాగా లావుగా ఉండే ముసలి వ్యక్తి లా కనిపించనున్నాడు .

ఈ చిత్రంలో నరేష్‌ పాత్ర కొత్త తరహాలో వినోదాన్ని పంచేలా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన మేకప్‌ కోసం లండన్‌లోని నిపుణులను సంప్రదించారు. వారి సూచనలకు అనుగుణంగా నరేష్‌కి మేకప్‌ చేస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు మేకప్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో హీరో, దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సెట్‌కి యూనిట్ మినహా మరెవరూ రాకుండా చూసుకొంటున్నారు. అల్లరి నరేష్‌ -రవిబాబు కాంబినేషన్‌లో 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్‌, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్‌ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ సారి నరేష్‌ని డబుల్‌ రోల్‌లో చూపించడానికి రవిబాబు కసరత్తులు చేస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X